Tirupati Stampede: తిరుమలలో వైకుంఠద్వారా దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ కొనసాగుతోంది.. తిరుమల, తిరుపతిలో విచారణ సాగుతోంది.. అయితే, రేపు మరోసారి విచారణకు హాజరు కావాలంటూ అధికారులకు నోటీసులు జారీ చేసింది తొక్కిసలాట ఘటమపై ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్.. ఈ రోజు దాదాపు నాలుగు గంటల పాటు టీటీడీ మాజీ జేఈవో సహా పలువురి అధికారులను విచారించింది కమిషన్.. గతం కంటే మెరుగైన భద్రత ఏర్పాట్లు చేపట్టామని కమిషన్ ముందు ఘటన జరిగిన సమయంలో జేఈవోగా ఉన్న గౌతమి తెలిపారు.. ఇక, రేపు తొక్కిసలాట ఘటన సమయంంలో ఎస్పీగా విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు, మాజీ టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ కుమార్, 13 మంది టీటీడీ జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు సీఐలు, 6 మంది ఎస్ఐలను, సీవీఎస్‌వో, మాజీ సీవీఎస్‌వోలను, ఈ నెల 21వ తేదీ నుంచి నుంచి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు 42 మంది విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్, 32 మంది పోలీసు సిబ్బందిని జస్టిస్ సత్యనారాయణ మూర్తి కమిషన్ విచారించనుంది.
Read Also: Shashi Tharoor: శశిథరూర్ వ్యాఖ్యలతో బీజేపీలో ఆనందం.. కాంగ్రెస్‌లో మౌనం..