NTV Telugu Site icon

AP CM: ఇంటింటికీ గ్యాస్ పంపిణీ ప్రారంభించిన సీఎం.. స్వయంగా టీ పెట్టిన చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించారు. అంతేకాకుండా.. సీఎం చంద్రబాబు స్వయంగా టీ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సురక్షితమైన గ్యాస్ నేరుగా పైన్ లైన్ ద్వారా ఇంటికి రావడాన్ని చూస్తున్నామని చెప్పారు. ఇది చాలా మంచి పరిణామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కర్నాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణలో 8 శాతం వాట AG&G సంస్థ కలిగి ఉందని అన్నారు. 80 లక్షల మందికి సురక్షితమైన గ్యాస్ అందిస్తున్నారని సీఎం వెల్లడించారు.

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి మ్యాచ్‌లు అంటే..?

గోదావరి బేసిన్ లో 40 శాతం గ్యాస్ లభిస్తోంది.. గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల వారు ఎక్కువగా వాడుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి గ్యాస్‌ను ఏపీకి పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తా‌నని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు వస్తున్నాయి.‌. గ్రీన్ ఎనర్జీ అనేది చాలా ముఖ్యంగా మారుతుందని తెలిపారు. పెట్రోలు, డీజిల్ సహా ఇతర వాటి వల్ల కాలుష్యం ఎక్కువ అవుతోంది‌.. నేచురల్ గ్యాస్, గ్రీన్ ఎనర్జీ మునుముందు కీలకంగా మారుతాయన్నారు. గ్రీన్ ఎనర్జీ 10 లక్షల కోట్ల టార్గెట్ గా నూతన పాలసీని విడుదల చేశాం‌మని చెప్పారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన జెన్ కో, ఎన్‌టీపిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారని సీఎం అన్నారు. అలాగే.. సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అందించేలా ప్రణాళిక చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Stock Market : ముంబై నుండి కరాచీ వరకు దయనీయ స్థితిలో స్టాక్ మార్కెట్.. దివాళా తీస్తున్న ఇన్వెస్టర్లు

త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు.. గ్రీన్ హైడ్రోజన్‌ను విదేశాలకు ఎగుమతి చేసే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఏపీలో ప్రతి ఇంటికి, పారిశ్రామిక కంపెనీలకు సిఎన్ జీ గ్యాస్ ను అందించాలని కంపెనీ కోరుతున్నానన్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నానని తెలిపారు. తాను స్వయంగా సిఎన్ జీ గ్యాస్ ను ప్రారంభించి ఆ ఇంటిలో కాఫీ పెట్టానని చెప్పారు. ఆ కుటుంబానికి తానే స్వయంగా కాఫీ ఇచ్చాను‌‌‌.. సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నేచురల్ గ్యాస్ తో పాటు నేచురల్ ఫుడ్ కూడా ఉండాలి.. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన AG&G సంస్థ అభినందిస్తున్నానని చెప్పారు.

Show comments