లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు. దుబాయ్, సౌతాఫ్రికాలో పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చెవిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. గత ఐదేళ్లుగా టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని.. తన ఫోన్‌ను కూడా ఎన్నికల ముందు ట్యాపింగ్ చేశారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Saiyaara: నా సగం జీవితం అక్కడే గడిచిపోయింది.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్
ఫోన్ ట్యాపింగ్‌పై ఎలాంటి సమాచారం సిట్ అడిగినా ఇస్తానన్నారు. లిక్కర్ కేసును ఈడీ, సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కోరారు. జగన్, కేసీఆర్ అవినీతి సొమ్మును దుబాయ్ తరలించడంలో చెవిరెడ్డి ముఠా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పారు. చెవిరెడ్డి అక్రమాలపై గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని… తాను ఆరోపణలు నేడు నిజమని ప్రజలకు అర్థం అవుతుందన్నారు. ముఖాన బొట్టు పెట్టుకుని శ్రీవారి భక్తుడిలా నటిస్తూ తప్పుడు పనులు చేయటం చెవిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వెంకటేష్ నాయుడు ప్రత్యేక విమానంలో చెవిరెడ్డి కూడా ఉన్నాడని మా అనుమానం అన్నారు. రన్ వే మీదకి ప్రభుత్వ వాహనం వెళ్లి ఒక అతిథిలా వీరిని తీసుకువస్తున్నారంటే దీని వెనక చాలామంది పెద్దల హస్తం ఉందన్నారు. చెవిరెడ్డి శిష్య బృందంలో ఇలాంటి వెంకటేష్ నాయుడులు చాలామంది ఉన్నారని.. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానం కల్గుతుందని పేర్కొన్నారు. వారి ఇప్పుడు కీలక బాధ్యతలోనే పనిచేస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు వారి వివరాలను పార్టీ హైకమాండ్‌కి ఇస్తానన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ పైపైకి బంగారం ధరలు.. నేడు ఎంత పెరిగిందంటే..!
ఒకప్పుడు కుటుంబం గడవటమే కష్టంగా ఉండే చెవిరెడ్డికి వేలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇలాంటి డెన్‌లు చెవిరెడ్డి ఎక్కడెక్కడ పెట్టాడో వెంటనే వెలికి తీయాలని కోరారు. అవినీతి పనులు చేస్తూ చంద్రగిరి నియోజకవర్గ పరువు తీశాడన్నారు. చెవిరెడ్డికి ఇంకా కొందరు అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు. తుడా అక్రమాలు త్వరలో వెలుగులోకి వస్తాయన్నారు. చంద్రగిరిలో దొంగ ఓట్లు ముద్రించారని.. దానికి కర్త, కర్మ, క్రియ చెవిరెడ్డే అన్నారు. దీనిపై కూడా కేసు వేస్తానని పులివర్తి నాని ప్రకటించారు.
