తిరుపతిలోని శ్రీకాళహస్తిలో వాలంటీర్ చందన ఆత్మహత్యకు పాల్పడింది.. రైలు నుంచి దూకి రెండేళ్ల కుమారుడితో పాటు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి నుంచి కనిపించకుండా పోయిన ఆమె రైలు పట్టాలపై విగతజీవిగా మారింది. తిరుపతి నుంచి నెల్లూరు మార్గంలో రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామం వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబందించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతిలోని కొర్లగుంట గ్రామానికి చెందిన చందన 9 వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ గొడవలే కారణంగా తెలుస్తోంది.
ట్రైన్ నుంచి దూకి వాలంటీర్ చందన ఆత్మహత్య
