Ganja batch violence: తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రంలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. అయితే, వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 11వ తేదీన రాత్రి ముగ్గురు మైనర్లు గంజాయి కొడుతూ పట్టుబడ్డారు. వారికి స్థానికులు దేహశుద్ధి చేసి, వెంటనే పోలీసులకు అప్పగించారు. ఇక, పోలీసులు మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వారిని విడిచి పెట్టారు. కానీ, ఈ సంఘటనతో కోపంగా ఉన్న ముగ్గురు మైనర్లు మరో 15 మంది స్నేహితులను కూడగట్టుకుని, తమపై చర్య తీసుకున్న వారి ఇళ్లపై దాడికి దిగారు. రాత్రి వేళ రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి ఇళ్లను ధ్వంసం చేశారు.
Read Also: Rajasab : విఎఫ్‌ఎక్స్‌తో మ్యాజిక్ చేసిన మిరాయ్.. రాజా సాబ్ మీద హ్యారీ పోటర్ రేంజ్ హోప్స్ !
అయితే, ఈ దాడిలో మంజుల, దొరసాని, గాయత్రి అనే మహిళల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ దాడిపై బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనతో దుర్గ సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, ఈ దాడి తర్వాత నిందితులు పరార్ అయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
