NTV Telugu Site icon

AP Deputy CM: నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష..

Pawan

Pawan

AP Deputy CM: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రియాక్ట్ అయ్యారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని తెలిపారు. ‘‘అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది అని ఆయన చెప్పుకొచ్చారు. జంతు కొవ్వుతో మాలిన్యమైంది.. విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరు అంటూ ధ్వజమెత్తారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హిందూ సమాజానికి కళంకం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Read Also: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. రిటైన్ లిస్ట్ ఇదే!

కాగా, లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇలాంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం చాలా బాధించింది అని పేర్కొన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనన్నారు. అందులో భాగంగా నేటి (ఆదివారం) నుంచి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు.