Today My Last Day: తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి తులసి, BSR డిగ్రీ కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. ఆత్మహత్యకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో “Today My Last Day” అని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇక, పోలీసులకు సమాచారం అందిన వెంటనే హాస్టల్‌కు చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తులసిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
Read Also: BYD Seal EV కార్లలో బ్యాటరీ లోపం.. రీకాల్ చేసిన కంపెనీ..
కాగా, తులసి కూలీ పనులు చేసుకునే పేద కుటుంబానికి చెందిన అమ్మాయి.. ఉన్నత చదువుల కోసం తిరుపతికి వచ్చిన ఆమె కాలేజీలో చదవడం ఇష్టం లేక, హాస్టల్ ఫీజు తిరిగి పొందాలని కోరింది. అయితే, కాలేజీ యాజమాన్యం ఫీజు రిటర్న్ ఇవ్వడానికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి లోనైంది. దీంతో ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘Today My Last Day’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
