చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడికే ప్రాణాలను.. తిరుపతి జిల్లాలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందారు..
ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.. పరిస్థితిని పరిశీలించి కేసును నమోదు చేసుకున్నారు..
ఈ ఘటన కారణం అని పోలీసులు తెలిపారు.. వేగంగా కారును నడుపుతున్న సమయంలో అటుగా బస్సు రావడంతో కంట్రోల్ చెయ్యలేక బస్సును ఢీ కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రస్తుతం వైద్యాన్ని అందిస్తున్నారు.. అందులో ఒకరికి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..