Tirumala Srivari Hundi Collection: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాకి ప్రతీరోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. ఇక కోట్లాది రూపాయలు, బంగారం, వెండి.. ఇలా స్వామివారికి కానుకల రూపంలో సమర్పిస్తూనే ఉంటారు.. కరోనా సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం దూరం కాగా.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో.. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. ఇక, గత 13 నెలలుగా.. రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతూ వస్తుంది శ్రీవారి హుండీ ఆదాయం.. వరుసగా 13వ నెల శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయల మార్క్‌ని దాటినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.. మార్చి మాసంలో స్వామివారికి హుండీ ద్వారా రూ.120.29 కోట్లు ఆదాయం లభించినట్టు పేర్కొంది.. గత ఏడాది మార్చి నుంచి వరుసగా రూ.100 కోట్ల మార్క్ ని స్వామివారి హుండీ ఆదాయం దాటుతోందని తెలిపింది.. గత ఏడాది ఆగస్టు నెలలో అత్యధికంగా రూ. 140.34 కోట్ల ఆదాయం శ్రీవారికి హుండీ ద్వారా లభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో హుండీ కానులక ద్వారా టీటీడీకి రూ.1,520.29 కోట్ల ఆదాయం వచ్చింది.. మొత్తంగా మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి హుండీ ద్వారా టీటీడీకి భారీగా ఆదాయం సమకూరింది.
Read Also: Atrocious News: బిడ్డ తెల్లగా ఉన్నాడని.. కన్న కొడుకునే గోడకేసి కొట్టిచంపిన తండ్రి