Tirupati Laddu Row: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీఐ డీఐజీ మురళీ రాంబా తిరుపతి సిట్ కార్యాలయానికి చేరుకుని సీబీఐ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. బృంద సభ్యుల్లో ఎవరెవరు ఏ ఏ విషయాలు దర్యాప్తు చేయాలో బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల 10వ తేదీలోపు నెల్లూరు ఏసీబీ కోర్టులో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసేలా దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.
Read Also: Tollywood Actress : తెలుగులో వరుస హిట్స్.. హిందీలో వరుస ప్లాప్స్
ఆ మేరకు నిందితులు, సాక్షుల్లో కొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు మాజీ పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చారు. నెయ్యి సరఫరా చేసిన డెయిరీలు, వాటి నిర్వాహకులు, ముడి సరకులు సమకూర్చిన వ్యాపారులతో పాటు డెయిరీ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు నాగేందర్, శేఖర్ పేర్లను మొదటి ఛార్జిషీట్లో నిందితులుగా తెలిపింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో అడ్డంకులు తొలగిపోవడంతో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అడ్డంకులు తొలగిపోవడంతో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు..
