TTD: రేపే పాలకమండలి భేటీ.. 49 అంశాలతో అజెండా..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రేపు సమావేశం కానుంది… 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఓ నిర్ణయానికి రానుంది… మొత్తంగా 49 అంశాలుతో కూడిన అజెండాను పాలక మండలి సమావేశం కోసం సిద్ధం చేశారు టీటీడీ అధికారులు… టేబుల్ ఐటెంగా మరి కొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు..

Read Also: Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఊరట

అజెండాలోని అంశాల విషయానికి వస్తే..
*2022-23 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించనుంది టీటీడీ పాలకమండలి

  • 3,171 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ 2022-23 వార్షిక బడ్జెట్‌
  • 1000 కోట్లు హుండీ ద్వారా ఆదాయం అభిస్తుందని అంచనా
  • రూ.230 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం
  • గరుడా వారధికి 25 కోట్ల రూపాయల కేటాయింపు
  • టీటీడీ అమలులోకి రానున్న నూతన పీఆర్సీ విధానం
  • ప్రభుత్వం జారి చేసిన ఆర్డినెన్స్ మేరకు కామన్ గుడ్ ఫండ్ క్రింద రూ. 50 కోట్లు చెల్లింపు
  • చిన్నపిల్లల ఆస్పత్రికి విరాళాల కోసం నూతనంగా అపన్న హృదయ స్కీం ప్రారంభం
  • శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసి అభివృద్దికి రూ. 3.9 కోట్లు కేటాయింపు
  • తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూములును వెనక్కి తీసుకోనున్న టీటీడీ
  • కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో శ్రీవారి దర్శన టికెట్లు పెంపుపై నిర్ణయం..
  • ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ