TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇవాళ ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు.. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేన్‌కు అవకాశం కల్పించగా.. ఎల్లుండి మధ్యహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయించనున్నారు..
Read Also: Actress Kasturi : అరెస్టుకు ముందు వీడియో రికార్డు చేసిన కస్తూరి
మరోవైపు.. ఇవాళ టీటీడీ పాలమండలి సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.. మరోవైపు.. నిన్న 71,441 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,595 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలుగా వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)