Site icon NTV Telugu

Tirumala: టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు..

Ttd

Ttd

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై అధికారులు చర్యలు చేపట్టారు. క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉద్యోగ నియమాలను ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అధికారుల నివేదికలో పేర్కొనడంతో, వారిపై టీటీడీ ఈవో సస్పెన్షన్ వేటు వేశారు. అయితే, విజిలెన్స్ విభాగం చేసిన దర్యాప్తులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. ఎలిజర్, స్టాఫ్ నర్స్ రోసీ, ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పని చేస్తున్న అసుంత క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఆచరణల్లో పాల్గొంటున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ఆయల ఈవో, సంబంధిత నిబంధనలను ఉల్లంఘించిన వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Fire Accident In Vizag: విశాఖలోని ఐటీసీ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ 100 కోట్ల నష్టం..?

అయితే, టీటీడీ ఉద్యోగులంతా హిందూ మతాన్ని పాటించాలని, మతాచారాలకు భిన్నంగా వ్యవహరించరాదని నియమాల్లో క్లియర్ గా ఉంది. కానీ, ఈ నియమాలకు విరుద్ధంగా నడిచినందున ఆ నలుగురు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది అని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ చర్యలతో మిగతా ఉద్యోగులకు హెచ్చరికగా నిలవాలని అన్నారు. ఉద్యోగ నియమావళిలో పేర్కొన్న ప్రమాణాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు ఉండాలని, లేదంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోబడతాయని వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version