NTV Telugu Site icon

Tirumala: శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు.. అసలు ఎందుకు నిర్వహిస్తారు..?

Ttd

Ttd

Tirumala: శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బందిచే కలిగే దోషాల వలన ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవమే పవిత్రోత్సవం. చారిత్రక నేపథ్యం వున్న పవిత్రోత్సవాలను 15వ శతాబ్ధంలో 5రోజుల పాటు నిర్వహించేవారు. ముఖ్యంగా క్రీ.శ.1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది.అప్పట్లో శ్రావణ మాసంలో పంచాహ్నికంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీమాన్ మహమండలేశ్వర మేదిని మీశర గండకట్టారి సాళువ మల్లయ్యదేవ మహారాజు వ్రాయించిన శాసనంలో మనకు ఈ విషయం అవగతమవుతుంది. అయితే, శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ. 1562 వరకు నిరాఘాటంగా నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఏ కారణం చేతనో అ తరువాత కాలంలో పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆపివేశారు. హైందవ సనాతన ధర్మ సంరక్షణ ను కాపాడేందుకు 1962 నుంచి టీటీడి పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని పున:ప్రారంభించింది.

Read Also: Supreme Court : మా ఆదేశాలను ఎందుకు పాటించడం లేదు.. యూపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

పవిత్రోత్సవాలలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేస్తారు.అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు అర్చకులు. ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమాని నిర్వహించిన అనంతరం శ్రీవారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవమూర్తులు, అనుబంధ ఆలయాలలో అర్చకులు పవిత్రాలు సమర్పిస్తారు. దీంతో మొదటి రోజు కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. రెండోవ రోజు వైఖానస అగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి వున్న మరియు భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి వుంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు. మొదట స్వామి, అమ్మ వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామి వారి మూళ్ళ విరాట్టుకు అనుభంద ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో కార్యక్రమం ముగుస్తుంది.మొదటి రెండు రోజులు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడంతో శ్రీవారికి మరియు అనుభంద ఆలయాల్లో పవిత్రాలు సమర్పించనున్న అర్చకులు మూడవ రోజు శ్రీవారి ఆలయంతో పాటు వివిధ అనుభంద ఆలయాల్లో దేవేరులకు సమర్పించిన పవిత్రాలను తొలగించి అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించి పూర్ణాహూతి ఇవ్వడంతో పవిత్రోత్సవాలు ఘట్టం పరిసమాప్తం కానున్నాయి.

Read Also: ITBP Constable Recruitment: దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త.. ఐటీబీపీలో ఉద్యోగాలు..

ఇక, మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరగనున్న వార్షిక ఉత్సవమైన పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడి సనద్ధమైంది. ముందుగా పవిత్రోత్సవాలకు అర్చకులు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.అంకురార్పణ కార్యక్రమంలో ఎల్లుండి రాత్రి శ్రీవారి సర్వసైన్యాధ్యక్షడు విశ్వక్సేనులు వారు ఆలయంలో నుంచి బయటకు వచ్చి ఊరేగింపుగా మాడా వీధులలో ఊరేగడం ఆనవాయితి.ఆలయం వెనుక వున్న వసంత మండపం వద్ద పుట్టమన్ను సేకరించి ప్రదక్షిణగా ఆలయానికి చేరుకున్ని ఆలయంలోని యాగశాలలో ఆ పుట్ట మన్నుతో నవధాన్యలను మెలకెత్తింపజేసేవారు. పవిత్రోత్సవాలకు అంకురర్పాణ రోజున శ్రీవారి ఆలయంలో ఆచార్య వరణం కార్యక్రమాని శాస్రోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు నిర్వహించే ఆచార్య పురుషులు ముందుగా గర్బాలయంలో పుణ్యాహవచనం కార్యక్రమాని నిర్వహించి టిటిడి ఇఓకి కంకణధారణ చేస్తారు.అటు తరువాతా ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేకంగా రప్పించిన పది మంది రుత్వీకులుకు వస్ర్త సమర్పణ కార్యక్రమాని నిర్వహిస్తారు.ఇక సాయంత్రం రంగనాయకుల మండపంలో అంకురార్ఫణ ఘట్టాని నిర్వహించి.. తరువాత రోజు నుంచి సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సప్త హోమ గుండాలలో పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు రుత్వీకులు. ఈ సందర్భంగా పవిత్రోత్సవాలు నిర్వహించే మూడు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ..

Show comments