TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీవారి భక్తుల అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. జులై నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్లను ఇవాళ్టి నుంచే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనం కోసం ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే దర్శన టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జరగనుంది. అదేవిధంగా, ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.
Read Also: Amit Shah: రాహుల్, ప్రియాంకా గాంధీని చూసైనా కాస్త నేర్చుకో..
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 69,049 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లుగా నమోదైంది. శ్రీవారి దర్శనం కోసం జూలై నెల టికెట్లు విడుదలవుతున్న నేపథ్యంలో భక్తులు అధికారిక టీటీడీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!