NTV Telugu Site icon

TTD EO Syamala Rao: శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్లపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

Ttd Eo Syamalarao

Ttd Eo Syamalarao

TTD EO Syamala Rao: శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్ల విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు.. ఈ రోజు డయల్‌ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకి 1500కి పరిమితం చేశాం అన్నారు.. శ్రీవాణి దర్శన టికెట్ల జారికి శాశ్వతప్రాతిపాదికన కౌంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు చర్యలు ప్రారంభించాం.. దళారి వ్యవస్థను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.. ఆన్ లైన్ లో ఓకే ఐడీ, మొబైల్ నెంబర్ ద్వారా టికెట్లు పొందుతున్న 40 వేల ట్రాన్షాక్షన్లు రద్దు చేశామని వెల్లడించారు.. ఆధార్ తో అనుసంధానం చేస్తే దర్శన టికెట్ల జారిలో దళారి వ్యవస్థను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు..

Read Also: Chhattisgarh : కుక్క కాటుతో చనిపోయిన ఆవులు… వాటి పాలను విక్రయించిన యజమాని

ఇక, శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచేందుకు చర్యలు ప్రారంభించాం అన్నారు ఈవో శ్యామలరావు.. లడ్డు ప్రసాదం దిట్టంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.. అయితే, తయారీ విధానంలోనే కొన్ని మార్పులు చేయాలన్నారు.. నాణ్యమైన లడ్డూ సేకరణపై దృష్టి పెట్టామని వెల్లడించారు. మరోవైపు.. టీటీడీలో డిప్యూటీ ఈవోలను బదిలీ చేశారు.. రిసెప్షన్‌ 1 డిప్యూటి ఈవోగా భాస్కర్.. రిసెప్షన్‌ 2 ఈవోగా హరింద్రనాథ్ ను.. కళ్యాణకట్ట డిప్యూటీ ఈవోగా వెంకటయ్య ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు..

Show comments