Site icon NTV Telugu

Tirumala: శ్రీవారి భక్తులకు డబుల్ బొనాంజా..!

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త.. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో ఆన్‌లైన్‌ దర్వా దర్శన టికెట్లు పొందే భక్తులకు ఈసారి డబుల్ బోనాంజా లభించునుంది. ఈ ఏడాది సర్వదర్శనం టోకెన్ కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే జారీ చేస్తున్న నేపథ్యంలో.. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొందే భక్తులు సర్వదర్శనం లేదా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందే సౌలభ్యం కూడా లభించనుంది..

Read Also: Sai Pallavi: రెండు భాగాలుగా సాయిపల్లవి కొత్త సినిమా!

కాగా, శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించునుంది టీటీడీ. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌ విధానంలో జారీ చేస్తుంది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి దర్శన టోకెన్లు ఆఫ్‌లైన్‌ విధానంలో జారీ చేస్తుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌ విధానంలో జారీ చేస్తుంది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్ల జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 6 మంది భక్తులు మృతి చెందడం.. 50 మందికి పైగా భక్తులు గాయపడటంతో టీటీడీ ఈ విధానానికి స్వస్తి పలికింది. పది రోజులకు సంబంధించి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది టీటీడీ.

Read Also: RRC NR Recruitment 2025: రైల్వేలో 4116 జాబ్స్.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక.. వెంటనే అప్లై చేసుకోండి

మొదటి మూడు రోజులపాటు సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించాలని.. మిగిలిన ఏడు రోజుల్లో సర్వదర్శనం భక్తులతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. మరోవైపు సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌ లైన్‌ విధానంలో కాకుండా ఆన్‌లైన్‌ విధానంలో జారీ చేసేలా ఏర్పాట్లు చేసింది. సర్వదర్శనం భక్తులకు రేపటి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఆన్‌లైన విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంది. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాఫ్ ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. డిసెంబర్ రెండవ తేదీన ఈ డిఫ్ విధానంలో వారికి దర్శన టోకెన్లను జారీ చేయనున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో జారీ చేయనున్నారు. రోజుకి 15 వేలు చొప్పున ఏడు రోజులకు సంబంధించి లక్షా 5 వేల టికెట్లను జారీ చేయనున్నారు.. దీనితో ఆన్‌లైన్‌ ద్వారా గతంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే పొందే భక్తులకు.. ఈసారి సర్వదర్శనం టోకెన్లు కూడా పొందే సౌలభ్యం లభించునుంది. దర్శన టోకెన్ కలిగిన భక్తులకు దర్శన సమయంలో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేకపోవడం టోకెన్ కలిగిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభించునున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ భక్తులకు ఇది డబుల్ బొనాంజాగా మారింది..

Exit mobile version