Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే జూన్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల..

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్యమైన సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ జూన్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల కాగా, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి భక్తులకు అలర్ట్‌ అయ్యే అవసరం వచ్చింది.. ఎందుకంటే.. శ్రీవారి దర్శనం ప్లాన్‌ చేసుకునేవారు.. దానికి అనుగుణంగా.. టికెట్లు బుక్‌ చేసుకుంటారు.. అయితే, నిమిషాల వ్యవధిలోనే టికెట్ల కోటా పూర్తి అవుతుందని.. అలర్ట్‌గా ఉంటేనే.. టికెట్లు పొందే అవకాశం ఉంటుంది..

Read Also: KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఇక తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి, క్యూ లైన్ శిలాతోరణం వరకు వేచి ఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులు దీర్ఘకాలం క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, నిన్న ఒక్కరోజే శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,272గా నమోదైంది. అలాగే 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. ఒక్కరోజులోనే రూ.3.37 కోట్లు హుండీ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులు టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని, దర్శనానికి ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.