Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే..?

  • శ్రీవారి భక్తులకు అలర్ట్
  • జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
  • 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో జనవరి నెలకు సంభందించి దర్శన టిక్కెట్లు
  • 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు
  • 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం.. ఉంజల్ సేవా..
  • ఆర్జిత బ్రహ్మోత్సవం.. సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల.
Tirumala

Tirumala

తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారికి అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్‌కు రెడీగా ఉండండి. జనవరి నెల టికెట్లు విడుదల కానున్నాయి. అందువల్ల మీరు జనవరి నెలలో కొండకు వెళ్లాలని చూస్తే.. మాత్రం టికెట్లు విడుదల అయిన వెంటనే బుక్ చేసుకోవడం ఉత్తమం.

Read Also: ICC: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న భారత మాజీ స్పిన్నర్..

ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో జనవరి నెలకు సంభందించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మీరు తిరుమల వెళ్లాలని అనుకుంటే మాత్రం ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టికెట్లు అలా వచ్చి ఇలా అయిపోతాయి. అంత ఫాస్ట్‌గా బుక్ చేసుకుంటారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు.

Read Also: Vettaiyan : వేట్టయన్ చేయనున్న నాని .. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్

22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయనుంది. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టోకేన్లు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ. 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనుంది టీటీడీ.