NTV Telugu Site icon

Mahesh Kumar Goud: నాగార్జున వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతం.. మేమెందుకు స్పందించాలి..!

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: అక్కినేని నాగార్జున న్యాయస్థానానికి వెళ్తే మేమెందుకు స్పందించాలి.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ లోను కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు.. ఇక, మంత్రి కొండా సురేఖ.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ వ్యవహారంపై మీడియా ప్రశ్నించగా.. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.. నాగార్జున న్యాయస్థానానికి వెళ్తే మేమెందుకు స్పందించాలి.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని కొట్టిపారేశారు..

Read Also: Tollywood : అసలే హిట్లు లేవు.. దానికి తోడు వరుణుడు..

మరోవైపు.. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది.. దానిపై స్పందించబోను అన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్.. ఇక, తెలంగాణ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.. చెరువుల్లో భవనాలను నిర్మించడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు.. హైడ్రా పేరుతో కొనసాగుతున్న కూల్చివేతలపై ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్.. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్న విషయం విదితమే.. తెలుగు ప్రజలందరి క్షేమం, శాంతి, శ్రేయస్సు కోసం శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహాన్ని కోరుతూ ఈరోజు నా కుటుంబంతో కలిసి పవిత్రమైన తిరుమల ఆలయాన్ని సందర్శించాను. రాజకీయ విభేదాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ కలిసి పనిచేయడం చాలా కీలకం అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు మహేష్‌కుమార్‌ గౌడ్.

Show comments