Site icon NTV Telugu

Tirumala Hundi Issue: శ్రీవారికి చెల్లని నోట్ల పంచాయతీ

Ttd

Ttd

Tirumala Hundi Issue: రూ.1,000 నోట్లతో పాటు.. పాత రూ.500 నోట్లను రద్దు చేసింది ప్రభుత్వం.. ఆ తర్వాత రూ.2 వేల నోట్లు, కొత్త రూ.500 నోట్లతో పాటు.. రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10.. ఇలా కొత్త కరెన్సీ తీసుకొచ్చింది.. అయితే తిరుమలలోని శ్రీవారికి మాత్రం పాత ఓట్ల పంచాయతీ తప్పడంలేదు.. శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు కోట్లలో ఉంటాయి. అయితే, ఇటీవలి కాలంలో హుండీలో పడుతున్న చెల్లని కరెన్సీ నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా డీమోనిటైజేషన్‌ సమయంలో రద్దైన పాత రూ.500, రూ.1000 నోట్లను ఇప్పటికీ కొందరు భక్తులు హుండీలో వేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Read Also: Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, టీటీడీ వద్ద ఇప్పటికీ రూ.400 కోట్లకు పైగా రద్దైన నోట్లు నిల్వలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోట్లను మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం వల్ల, అవి ఉపయోగించలేని స్థితిలోనే ఉన్నాయి. దీంతో టీటీడీకి ఆర్థిక పరంగా నష్టం వాటిల్లుతోంది. ఇదిలా ఉండగా, మరో వైపు ఇటీవల రద్దు చేసిన రూ.2000 నోట్లను కూడా భక్తులు హుండీలో సమర్పిస్తున్నారు. ప్రతి నెలా సుమారు రూ.35 లక్షల విలువైన రూ.2000 నోట్లు హుండీలో చేరుతున్నట్లు అంచనా. అయితే ఈ నోట్ల విషయంలో మాత్రం టీటీడీ కొంత ఉపశమనం పొందుతోంది. ఎందుకంటే, ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. భక్తుల విశ్వాసంతో సమర్పించే ఈ కానుకలు దేవుడికి అంకితం అయినప్పటికీ, చెల్లని నోట్ల సమస్య టీటీడీ నిర్వహణకు సవాల్‌గా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version