Malla Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. పార్టీ మారుతున్నారంటూ ఎప్పటి నుంచో ప్రచారం సాగుతూ వస్తుంది.. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరతారనే చర్చ సాగింది.. అయితే, ఆయన ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు.. తాజాగా మరోసారి తిరుమల వేదికగా క్లారిటీ ఇచ్చారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను పార్టీ మారలేదు అని స్పష్టం చేశారు.. అయితే, సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ ఉత్కంఠమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు మల్లారెడ్డి.. దీంతో.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? ఇంకా ఏదైనా ఆలోచన ఉందా? అనే కొత్త చర్చ మొదలైంది..
Read Also: TG High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు, వరదలపై స్పందించిన మల్లాడిరెడ్డి భారీ వర్షాలు.. వరదలు విజయవాడను అతలాకుతలం చేసినా.. 74 సంవత్సరాల వయస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక.. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేశారు.. తెలంగాణను తిరిగి కేసీఆర్, కేటీఆర్ అభివృద్ది చేస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. కాగా, నిన్న తిరుపతి చేరుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు.. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా నడకమార్గంలో తిరుమల చేరుకున్న విషయం విదితమే. ఇక, ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు మల్లారెడ్డి..