Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

Tirumala

Tirumala

Tirumala: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కలియుగ వైకుంఠం కిక్కిరిసిపోయింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా, టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి24 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 58, 519 మంది భక్తులు దర్శించుకోగా.. 30, 360 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. 3.27 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది.

Read Also: Building Collapses: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి

అయితే, ఇవాళ ఆన్ లైన్లో జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు జరగనుంది. మరోవైపు, టీటీడీలో అన్యమత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ అన్షుతాపై వేటు వేశారు.. అన్షుతాపై సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అన్షుతాను ఆయుర్వేదిక్ ఫార్మసీకి ఈవో శ్యామలరావు బదిలీ చేసేశారు.

Exit mobile version