NTV Telugu Site icon

Gautam Gambhir: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్..

Gmabhir

Gmabhir

భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్ సతీసమేతంగా కలిసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

గౌతమ్ గంభీర్ తో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. గంభీర్ కూడా అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. ఆలయం వెలుపలకు వచ్చిన గౌతమ్ గంభీర్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. దీంతో అందరికీ గంభీర్ సెల్ఫీలు ఇచ్చారు.