Site icon NTV Telugu

Flights Fly Over Tirumala Temple: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు..!

Ttd

Ttd

Flights Fly Over Tirumala Temple: తిరుమలలో మరోసారి కలకలం రేగింది.. ఇవాళ ఉదయం నుంచి శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.. ప్రతి నిత్యం తిరుమల కొండ పై ఆలయానికి సమీపంలో తరుచూ విమానాలు వెళ్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదు.. దీనిపై టీటీడీ ఆగమ పండితులు ప్రతీసారి చెబుతా వస్తున్నారు.. కానీ, తిరుమల కొండ గగన తళంలో తరుచూ విమానాలు వెళ్తున్నాయి.. తిరుమలను నో ఫ్లైజోన్ గా ప్రకటించాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తిని విమానయాన శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శులు ఉన్నాయి.. గతంలోనూ శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు ఎగడరంపై భక్తులు ఆందోళన వ్యక్తంచూస్తూనే ఉన్నారు.. కానీ, తరచూ.. ఇది రిపీట్ అవుతూనే ఉంది.. మరోవైపు.. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగరడం, వాటిని టీటీడీ విజిలెన్‌ స్వాధీనం చేసుకోవడం.. కొన్నిసార్లు కేసులు నమోదైన విషయం విదితమే.. అయితే, ఈ రోజు ఉదయం నుంచి ఏకంగా ఐదు విమానాలు శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల మీదుగా వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు..

Read Also: Rajnath Singh : రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు

Exit mobile version