Site icon NTV Telugu

Ambati Rambabu: రెడ్ బుక్పై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు..

Ambati

Ambati

మాజీ మంత్రి అంబటి రాంబాబు రెడ్ బుక్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్‌కు తమ కుక్క కూడా భయపడదని విమర్శించారు. తమ ఆఫీస్‌ను కూల్చినట్లు.. రుషి కొండను కూల్చేస్తారా అని అన్నారు. చంద్రబాబు రుషి కొండ భవనాలు చూసి ఆశ్చర్య పోతున్నారు.. చంద్రబాబు ఈ భవనాలు చూసి సిగ్గు పడాలని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కాలర్ ఎగరేసుకుని చెప్పండి.. జగన్ రుషికొండలో అద్భుత భవనాలు కట్టాడు అని చెప్పండని పేర్కొన్నారు. రుషి కొండలో ప్రభుత్వ భవనాలు కడితే విలాస భవనాలు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారని అని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు గెలుపుకు కృషి చేస్తారు.. ప్రజాస్వామ్య దేశంలో గెలుపు ఓటములు సహజం అని అంబటి రాంబాబు తెలిపారు.

Read Also: Venky Atluri: సినిమా మొత్తం ఒకటే షర్ట్, ప్యాంటు ధరించిన డైరెక్టర్

ఐక్యమే మన బలం, మన ఆయుధం.. ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. మద్యం దుకాణాలు తెరవక ముందే టీడీపీ నేతలు దుకాణాలు తెరిచారు.. వీటన్నింటినీ ప్రజలు దృష్టికి తీసుకువెళ్లాలి.. ప్రజలు బంగారు పళ్ళెంలో పెట్టి మనకు అధికారం ఇస్తారు.. పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే సహించను చెప్పిన వ్యక్తి ఈరోజు ఇక్కడ రోజుకో హత్య, అత్యాచారం జరుగుతోందన్నారు. చంద్రబాబు పాలనలో ఏమి జరిగినా ప్రశ్నించరా..? మీ నోటికి ప్లాస్టర్ తీయండని పేర్కొన్నారు.

Read Also: Venky Atluri: హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లకు ఆడిషన్ ఇచ్చా.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్

సీపీఎం, సీపీఐతో పవన్ పొత్తు పెడితే చేగువేరా గుర్తుకు వస్తారు.. బీజేపీతో పొత్తు లో భాగంగా సనాతన ధర్మం గుర్తుకు వస్తుందని విమర్శించారు. శర వేగంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది.. యువతరం ఈరోజు ముందుకు వచ్చింది.. చంద్రబాబు సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని స్థానాలు గెలుస్తుంది.. ఐక్యత మన ఆయుధం, విజయమే మన లక్ష్యమని అంబటి రాంబాబు తెలిపారు.

Exit mobile version