Site icon NTV Telugu

Drone in Tirumala: తిరుమలలో అపచారం..! శ్రీవారి ఆలయంపై మరోసారి ఎగిరిన డ్రోన్ కెమెరా..

Drone In Tirumala

Drone In Tirumala

Drone in Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమలలో మరోసారి భధ్రతా వైఫల్యం భయటపడింది. రాజస్థాన్ కి చెందిన యూట్యూబర్ ఏకంగా శ్రీవారి ఆలయం పై డ్రోన్ కెమెరా ఎగురవేయడం కలకలం సృష్టించింది.. సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న హరినామ సంకీర్తన కేంద్రం ముందు నుంచి డ్రోన్ కెమెరా ఎగురవేశాడు యూట్యూర్‌.. ఏకంగా పది నిముషాల పాటు శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ఎగిరింది.. అయితే, స్థానికంగా వున్న వారు ఇచ్చిన సమాచారంతో ఎట్టకేలకు రంగంలోకి దిగారు విజిలెన్స్ అధికారులు.. డ్రోన్ ఎగురువేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని పిఏసి 4 లో వున్న కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తరలించారు. పోలీసులు కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుకోని రాజస్థాన్ కి చెందిన అన్షుమన్ ని రహస్యంగా విచారిస్తూన్నారు. అసలు అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకోని డ్రోన్ కెమరా తిరుమలకు ఎలా వచ్చింది..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.. శ్రీవారి ఆలయం మీదుగా డ్రోన్ 10 నిమిషాల పాటు ఎగురుతూ ఉన్నా గుర్తించలేని పరిస్థితిలో టీటీడీ విజిలెన్స్ వుండడం విమర్శలకు దారితీసింది. విచారణలో మర పోలీసులు ఏ వివరణ ఇస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version