NTV Telugu Site icon

Janasena: స్పష్టం చేసిన పవన్‌ కల్యాణ్‌.. నిరసనలకు జనసేన దూరం..!

Pawan Jagan

Pawan Jagan

Janasena: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన కాకరేపుతోంది.. తిరుమల లడ్డూ వివాదం ముదురుతోన్న వేళ.. ఆయన తిరుమల పర్యటన ఉత్కంఠగా మారింది.. అయితే, జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చే శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నాయి.. ముఖ్యంగా బీజేపీ, హిందూ సంఘాలు.. వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.. మరోవైపు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలతో తిరుపతిలో నిరసనలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. వైఎస్‌ జగన్‌ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ.. జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడవద్దు‌‌‌‌.. ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.. ఇక, అధినేత వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్‌ జగన్ పర్యటన, డిక్లరేషన్ ఆంశాలకు దూరంగా ఉన్నారు జనసేన నేతలు…

Read Also: Pakistan : తన బిడ్డను వెనక్కి ఇవ్వాలని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్తాన్ బ్రిటీష్ పౌరుడు

కాగా, వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు. అయితే జగన్‌ డిక్లరేషన్ ఇచ్చాకే వెళ్లాలని.. లేదంటే అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందు సంఘాల హెచ్చరించాయి. దీంతో భద్రతను భారీగా పెంచారు. అటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్నారు పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. జగన్ పర్యటనతో హిందూ పరిరక్షణ సమితి, కూటమినేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 లకు ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్‌లో మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేదానిపై ఉత్కంఠగా మారింది.