Bomb Threat: టెంపుల్ సిటీ తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం ఈమెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాదిక్ కు జైలుశిక్ష పడింది. ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరపున తమిళనాడు సీఎం స్టాలిన్ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్ఐ పూనుకొందని అందులో భాగంగా తిరుపతిలోని నాలుగు ప్రైవేటు హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరించారు. హోటళ్ల యాజమానుల సమాచారంతో వెంటనే పోలీసులు తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్స్ పై అలిపిరి, తిరుపతి ఈస్ట్ పీఎస్‌లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మరోవైపు.. స్టార్ ఎయిర్‌లైన్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి.. స్టార్ ఎయిర్‌లైన్స్ కు చెందిన ఎస్ 5-154 విమానానికి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపులు చేశారు.. అదమ్ నాన్ జా 333 పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్ నుండి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు..
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?