Deputy CM Pawan Kalyan Tirumala Visit: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు తిరుమలకు చేరుకోనున్నారు. ప్రాయశ్చిత దీక్ష చేస్తున్న పవన్.. ఈరోజు రాత్రి తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి కాలి నడకన తిరుమలకు బయల్దేరుతారు. ఇక, పవన్ కల్యాణ్ పర్యటనకు నడకమార్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 200 మీటర్ల పరిధి వరకు రోప్ పార్టీలతో భద్రతన ఏర్పాటు చేస్తున్నారు. పవన్‌తో పాటు నడిచే ప్రయత్నం చేయవద్దని పార్టీ నేతలకు ఇప్పటికే సూచించారు జనసేన నేతలు.. ఇక, తిరుమల పర్యటన నిమిత్తం.. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని.. రాత్రికి కాలినడకన తిరుమల చేరుకోనున్నారు..
Read Also: LPG Cylinder : పండుగలకు ముందు సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
కాగా, తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగిన విషయం విదితమే.. దీనిపై రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంది.. మరోవైపు.. లడ్డూకు వాడిన నెయ్యి రిపోర్ట్‌పై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెప్టెంబర్ 18నాటి సీఎం ప్రకటనకు ఆధారం ఉందా అని ధర్మాసనం నిలదీసింది. కోట్లాది భక్తుల మనోభావాలతో కూడిన అంశమన్న న్యాయస్థానం.. ఇరువైపులా వాదనలు రికార్డ్ చేసి తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో వైసీపీ నేతలు అధికార పక్షంపై ఘాటుగా స్పందించిన విషయం విదితమే.