Tilak Varma Special Gift: మంత్రి నారా లోకేష్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్.. తమ్ముడు ఐ యామ్ వెయిటింగ్!
- ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపులో తిలక్ వర్మ కీ రోల్..
- ఫైనల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనను అభినందించిన మంత్రి లోకేష్..
- నారా లోకేష్‌కు ప్రత్యేకమైన బహుమతి ఇస్తున్నట్లు తెలిపిన యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma Special Gift: ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపులో కీ రోల్ పోషించిన యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ ఏపీ విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఓ స్పెషల్ బహుమతిని అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను తన అద్భుత ప్రదర్శనను అభినందించిన లోకేష్‌కు ప్రేమతో ఇవ్వనున్నట్లు తిలక్ ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా తెలియజేశాడు. అయితే, తిలక్ వర్మ ఇచ్చిన ఈ ప్రత్యేక గిఫ్ట్ పై నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, “తమ్ముడు తిలక్ బహుమతి నాకు ఎంతో ప్రత్యేకం. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత అతడి చేతుల మీదుగానే ఈ క్యాప్ తీసుకుంటాను అని వెల్లడించారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
అయితే, క్యాప్‌పై తిలక్ వర్మ సంతకం చేస్తున్న వీడియోను కూడా మంత్రి నారా లోకేష్ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తుంది. ఆసియా కప్ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన టీమిండియాకు విజయం అందించడాన్ని లోకేష్ కొనియాడటం, దానికి ప్రతిగా తిలక్ ప్రత్యేక బహుమతి ఇవ్వడం ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
This made my day, tammudu! 😍 Excited to get it straight from you when you’re back in India, champ!#AsiaCup2025 @TilakV9 pic.twitter.com/hsdEljJ2lS
— Lokesh Nara (@naralokesh) September 29, 2025
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!