Site icon NTV Telugu

Tilak Varma Special Gift: మంత్రి నారా లోకేష్‌కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్.. తమ్ముడు ఐ యామ్ వెయిటింగ్!

Tilak Varma

Tilak Varma

Tilak Varma Special Gift: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపులో కీ రోల్ పోషించిన యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ ఏపీ విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఓ స్పెషల్ బహుమతిని అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో తాను ఉపయోగించిన క్యాప్‌ను తన అద్భుత ప్రదర్శనను అభినందించిన లోకేష్‌కు ప్రేమతో ఇవ్వనున్నట్లు తిలక్ ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా తెలియజేశాడు. అయితే, తిలక్ వర్మ ఇచ్చిన ఈ ప్రత్యేక గిఫ్ట్ పై నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, “తమ్ముడు తిలక్ బహుమతి నాకు ఎంతో ప్రత్యేకం. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత అతడి చేతుల మీదుగానే ఈ క్యాప్‌ తీసుకుంటాను అని వెల్లడించారు.

Read Also: Pakistan Auto Industry: పాకిస్తాన్ విడిచి పారిపోతున్న ఆటో మొబైల్ కంపెనీలు.. ఇక సెకండ్ హ్యాండ్ వాహనాలే దిక్కు

అయితే, క్యాప్‌పై తిలక్ వర్మ సంతకం చేస్తున్న వీడియోను కూడా మంత్రి నారా లోకేష్ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తుంది. ఆసియా కప్ ఫైనల్ లో అద్భుతంగా రాణించిన టీమిండియాకు విజయం అందించడాన్ని లోకేష్ కొనియాడటం, దానికి ప్రతిగా తిలక్ ప్రత్యేక బహుమతి ఇవ్వడం ప్రస్తుతం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.

Exit mobile version