NTV Telugu Site icon

ఏపీ తెలంగాణ బోర్డర్ లో కఠిన ఆంక్షలు… రోగుల ఇక్కట్లు 

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.  పొరుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు అధికంగా ఉండ‌టంతో ప్ర‌భుత్వం అప్ర‌మత్తం అయ్యి లాక్‌డౌన్‌ను విధించింది.  బోర్డర్ల వద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేసింది ప్ర‌భుత్వం.  బోర్డ‌ర్ వ‌ద్ద ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ ల‌ను హైద‌రాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాక‌రిస్తున్నారు.  దీంతో క‌ర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వ‌ద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్య‌లో బారులు తీరాయి.  దీంతో చెక్ పోస్టుల వ‌ద్ద ప‌డిగాపులు కాచి అంబులెన్స్ లో ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు.  అంబులెన్స్ ల‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ప‌దుల సంఖ్య‌లో అంబులెన్స్ లు వెనక్కి వెళ్లాయి.  ఈ స‌మ‌స్య‌పై ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీకి వివ‌రిస్తామని ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ పేర్కొన్నారు.  తెలంగాణ ప్ర‌భుత్వంతో సీఎస్ మాట్లాడ‌తార‌ని, అడ్మీష‌న్లు ఖ‌రారైన అంబులెన్స్ లు పంపే ఏర్పాటు చేస్తామ‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.