అనకాపల్లిలో మళ్లీ రాయల్ బెంగాల్ టైగర్ కలకలం రేపుతోంది. గతరాత్రి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గంధవరం గ్రామంలో పులి సంచారంతో రైతులు ఆందోళనకు దిగారు. పులి పెయ్య మీద కాళ్ళు వేసి పీక్కుని తింది. దీంతో రైతు వెంకటరావు… అక్కడకు తమ పెంపుడు కుక్కలతో వెళ్లారు. ఆ సమయంలో పులిని చూసి ఆందోళనకు గురయ్యాడు రైతు. అతని పెంపుడు కుక్క పులిపై దాడి చేయగా పులి పెయ్యను వదిలి కుక్కను…ఎత్తుకోని పోయిందని రైతు చెబుతున్నారు. దీంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు సంఘటన స్దలానికి చేరుకొని పులి జాడకోసం తగు చర్యలు తీసుకుంటున్నారు.
ఇంతకుముందే ఆవులు, గేదెలపై పులి దాడులకు తెగబడింది. అనకాపల్లి మండలం బవులవాడ శివారులోని ఒక పశువుల పాకలో రెండురోజుల క్రితం ఒక ఆవు దూడను చంపేసి, సమీపంలోని పోతుకొండపైకి ఈడ్చుకెళ్లింది. కొంత భాగాన్ని తినేసి అడవుల్లోకి వెళ్లిపోయింది. అంతకుముందు కాకినాడ జిల్లాలోని వివిధ అటవీ ప్రాంతాల్లో పులి సంచరించి భయభ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు నెల రోజులపాటు సంచరించి, అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్లుకు చిక్కకుండా తప్పించుకుంది.
తరువాత గత నెల 27వ తేదీన అనకాపల్లి కోటవురట్ల, నక్కపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. అనకాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 రోజుల నుంచి పెద్దపులి సంచరిస్తుంది. పులిని బంధించేందుకు అటవీ, జూ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రూట్ మారుస్తూ.. దాడులు చేస్తోంది పులి. వివిధ ప్రాంతాలలో పులికి సంబంధించిన కదలికలు రికార్డు అయ్యాయి. అయితే పులి మాత్రం తెలివిగా వ్యవహరిస్తోంది. ఒక్కోరోజు ఒక్కో ప్రాంతానికి వెళుతోంది పులి. పులిని త్వరగా పట్టుకోవాలని అనకాపల్లిలోని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
PM Modi: ధియోఘర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ