Site icon NTV Telugu

ఏపీలో మరో మూడు మెడికల్‌ కాలేజీలు.. కేంద్రం ఆమోదం..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం… పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి… ఈ విషయంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పవార్.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు..

Read Also: చెడ్డీ గ్యాంగ్ కేసులో పురోగతి..

విజయసాయి రెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిచ్చిన భారతి పవార్.. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయన్న ఆమె.. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ, అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

Exit mobile version