NTV Telugu Site icon

Thota Trimurthulu: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్‌దే నిర్ణయం

Thota Trimurthulu

Thota Trimurthulu

Thota Trimurthulu Interesting Comments On Ramachandrapuram Seat Issue: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మిథున్ రెడ్డితో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీలో ఎవరికెన్ని అభిప్రాయాలైనా ఉండొచ్చని, కానీ సీటు విషయంలో అంతిమ నిర్ణయం అధిష్తానందేనని తేల్చి చెప్పారు. వేణు వ్యవహారశైలితో కేడర్ ఇబ్బంది పడుతోందని ధ్వజమెత్తారు. అదే విషయం తాను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళానని, త్వరలో సీఎం జగన్‌ని కలిసి పార్టీలో పరిస్థితులను వివరిస్తానని అన్నారు. తాను, బోస్ ఆరుసార్లు ఎన్నికల్లో తలపడ్డామని గుర్తు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలో చెప్పాల్సింది వ్యక్తులు కాదు, హైకమాండ్ అని చెప్పారు. కేడర్ ఇబ్బందులు పడుతుంటే.. తాను గానీ, బోస్ గానీ చూస్తూ ఉరుకోలేమని పేర్కొన్నారు. రామచంద్రపురంలో జనసేన, టీడీపీలకు ఎలాంటి బలం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎగిరేది వైసీపీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు.

Dimple Hayathi: ఎద అందాలను ఎరగా వేసి.. కుర్రాళ్లను చంపేస్తున్న డింపుల్

అంతకుముందు మిథున్ రెడ్డితో జరిగిన సమావేశంలో భాగంగా.. తోట త్రిమూర్తులు ఆయన దృష్టికి కొన్ని కీలక విషయాలు తీసుకెళ్లారు. రామచంద్రపురంలో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని చెప్పారు. ఇంతకుముందు తాను, పిల్లి సుభాష్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నామని.. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవని వివరించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తన దగ్గరికి రాలేదంటే ఇబ్బందిపెట్టడం.. వంటివి మంత్రి వేణు చేస్తున్నారని త్రిమూర్తులు ఫిర్యాదు చేశారు. రామచంద్రపురంలో ప్రతి విషయమూ పొలిటికల్ మైలేజ్ కోసమే జరుగుతోందని వివరించారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అభిమానం వేరని చెప్పిన ఆయన.. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీ డ్యామేజ్ అవుతుందని సూచించారు. త్రిమూర్తులు చెప్పిన విషయాలన్నింటికీ అనుకూలంగా స్పందించిన మిథున్ రెడ్డి.. ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే ఆయనతో సమావేశం ఉంటుందని చెప్పారు.

Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం