Site icon NTV Telugu

Gottipati Ravi Kumar: థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పాండ్కు గండి.. మంత్రి సీరియస్.. !

Gottipati Ravi

Gottipati Ravi

Gottipati Ravi Kumar: నెల్లూరు జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ యాష్ పాండ్ కు గండి పడిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ రియాక్ట్ అయ్యారు. ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడారు మంత్రి.. గండిపడిన ఏపీజెన్కో యాష్ పాండ్ పునరుద్ధణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గొట్టిపాటి రవి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి నష్టం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read Also: Andhra Pradesh: దేవదాయ శాఖలో వెలుగులోకి వస్తున్న వరుస కుంభకోణాలు.

అలాగే, యాష్ పాండ్ కు గండిపడడం వల్ల ఇబ్బందులు పడ్డ బాధిత రైతులను తప్పకుండా ఆదుకుంటామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు. యాష్ పాండ్ కు గండి పడిన సంఘటనపై సమగ్ర విచారణకి ఆదేశించించారు.. ఇందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తాలు తీసుకోవాలని సూచించారు. త్వరితగతిన యాష్ పాండ్ కు పడిన గండికి మరమ్మతులు చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపునిచ్చారు.

Exit mobile version