NTV Telugu Site icon

Nandamuri Balakrishna: బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..

Balakrishna

Balakrishna

Nandamuri Balakrishna: కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామాన్ని పట్టించుకోరా అని గ్రామస్తులు ప్రశ్నించగా.. బాలకృష్ణ మాట్లాడుతూ.. పట్టించుకోను.. ఫోటోలు దిగారుగా.. ఇక వెళ్ళండి అంటూ ఆగ్రహం చేశారు. కొమరవోలు గ్రామమా అదెక్కడ అని వ్యంగంగా మాట్లాడారు. కొమరవోలు గ్రామానికి ఈ జన్మలో రాను అని బాలయ్య అన్నారు. వాళ్లు లింగాయత్తులు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వ్యంగాస్త్రాలు సందించారు. అయితే, బాలకృష్ణ మాతృమూర్తి బసవతారకం స్వగ్రామం కొమరవోలు.