Site icon NTV Telugu

Vishakapatnam: సాయిప్రియ అదృశ్యం కేసులో ట్విస్ట్.. లవర్‌తో వెళ్లిపోయినట్లు గుర్తింపు

Sai Priya

Sai Priya

Twist in saipriya missing case in vishakapatnam rk beach
విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్‌తో పరారైంది. అయితే సముద్రంలో గల్లంతైనట్లు భర్త శ్రీనివాస్ భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సాయిప్రియ కోసం రెండ్రోజులుగా నేవీ హెలికాప్టర్‌తో అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఎట్టకేలకు ఆమె నెల్లూరులో లవర్‌తో ఉన్నట్టు పోలీసులు సమాచారం అందుకున్నారు.

Read Also: Home-Built Plane: కుటుంబం కోసం సొంతంగా విమానాన్నే నిర్మించిన కేరళ వ్యక్తి

కాగా సాయిప్రియకు శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్‌ఏడీ వద్ద ఓ కాలేజీలో సాయిప్రియ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈనెల 25న తమ పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్‌, ఆయన భార్య సాయిప్రియ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలిసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకు ఫోన్ లో మెసేజ్ రావడంతో ఒడ్డు నుంచి వెనక్కి వచ్చి మెసేజ్ చూసుకుని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు. దీంతో తన భార్య సముద్రంలోని కెరటాలకు కొట్టుకుపోయిందని భర్త శ్రీనివాస్ ఆందోళన పడ్డాడు. ఆరోజే గత ఈతగాళ్ల సాయంతో బీచ్‌లో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే బీచ్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం, లైఫ్ జాకెట్లు లేవని తీవ్రస్థాయిలో స్థానికంగా ఆరోపణలు వచ్చాయి.

తాజాగా ఈ అంశంపై విశాఖ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ స్పందించారు. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. ప్రస్తుతం సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఆమెను నెల్లూరు నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

Exit mobile version