Site icon NTV Telugu

Congress Party: ఏపీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్‌రెడ్డి?

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరింది. కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించింది. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్‌గా పనిచేస్తున్న శైలజానాథ్ అంత యాక్టివ్‌గా లేకపోవడం, గతంలో ఏపీసీసీ చీఫ్‌గా పనిచేసిన రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Adimulapu Suresh: ఏపీలో ఆగస్టు 15 తర్వాత ఊహించని పరిణామాలు

కాగా ఇప్పటికే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు నేతలతో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతారా లేదా అనే అంశంపై ఆయన ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో తనకు పీసీసీ చీఫ్ పదవిపై అంతగా ఆసక్తి లేదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సాగు, తాగునీరు ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ఆయన ఆరోపణలు చేశారు. అయితే రానున్న రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా కిరణ్ కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version