NTV Telugu Site icon

Schools Holidays: విద్యార్థులకు పండగే..! ఆగస్టులో పాఠశాలలకు ఏకంగా 9 రోజులు సెలవులు..

Schools Holidays

Schools Holidays

Schools Holidays: సెలవులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలకు రోజూ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, అందరూ సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలవులు వస్తే ఇంటికి వెళ్లి అమ్మ వంట తిని.. స్నేహితులతో కబుర్లు చెప్పుకుని.. సరదాగా గడపాలని అనుకుంటారు. అయితే సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు మాత్రం ఆగస్టు నెలలో చాలా వరకు సెలవులు వచ్చాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం, అనేక ఇతర పండుగలు, ఆదివారాలు మొత్తం 9 రోజులు సెలవు. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు సెలవులు ఉన్నాయి. అంతే కాదు మరో రోజు కూడా సెలవు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read also: Fastag New Rules: ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు..ఆ తప్పులు చేస్తే బ్లాక్‌లిస్ట్!

శని, ఆదివారాల కారణంగా ఆగస్టు 10, 11వ తేదీల్లో వరుసగా రెండు రోజులు సెలవులు ఉంటాయి. అలాగే ఆగస్ట్ 15 గురువారం, ఆగస్ట్ 16 శుక్రవారం వరుసగా రెండు సెలవులు.. కాగా.. మధ్యలో శనివారం పాఠశాలకు వెళ్తే మళ్ళీ వరుసగా 18న అంటే ఆదివారం, ఆగస్టు 19న రక్షా బంధన్ సందర్భంగా రెండు రోజులు సెలవులు వస్తాయి. మళ్లీ ఆగస్టు 25, 26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు ఉంటాయి. మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. ఆగస్టు 15, 16, 18, 19 తేదీలు అంటే 17వ తేదీ తప్పా వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. మధ్యలో శనివారం వున్న ఆ ఒక్కరోజు హాలిడే ఇస్తే వరుసగా 5 సెలవులు వచ్చే అవకాశం ఉంది.

Read also: Yadadri Bhuvanagiri: బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ మందుబాబులు..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు సెలవుల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ విద్యా సంవత్సరం 2024-25 ప్రకారం మొత్తం 232 పని దినాలు మరియు 83 రోజులు సెలవులు. ఆగస్ట్‌లో 31 రోజులలో 24 పనిదినాలు ఉన్నాయి. అంటే 7 రోజుల సెలవులు. అయితే వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమ కారణంగా మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్ట్ 4 ఆదివారం, ఆగస్ట్ 10 రెండవ శనివారం, ఆగష్టు 11 ఆదివారం, ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్ట్ 16 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, ఆగస్ట్ 18 ఆదివారం, ఆగస్ట్ 19 ఆదివారం రాఖీ పూర్ణిమ/శ్రావణ పూర్ణిమ ఆగష్టు 25 ఆదివారం, ఆగస్ట్ 26 సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమికి సెలవులు ఉన్నాయి. ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. తెలంగాణలో కూడా 9 రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు ఆగస్టు నెల పండుగ వాతావరణం తెచ్చిపెట్టింది. దీంతో పలు రాష్ట్రాలనుంచి తెలంగాణలో వున్నవారు తమ ఊళ్లకు వెళ్లడానికి ముందుగానే బస్సులు, రైళ్లలకు బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో బస్సులకు, రైళ్లకు మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పటి నుంచే నో బుకింగ్ చూపిస్తుండటంతో అటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు తలనొప్పిగా మారింది.
Indian2: OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న భారతీయుడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?