ఏపీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. తమ హీరో సినిమా చూద్దామని వెళ్తుంటే థియేటర్లు మూసి ఉండటం చూసి ఆవేదనకు లోనవుతున్నారు. టిక్కెట్ రేట్లపై కొత్త జీవో రాకపోవడంతో జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ముఖ్యంగా సి, డి సెంటర్లలో థియేటర్ల యజమానులు లబోదిబోమంటున్నారు. రూ.20, రూ.15, రూ.5 రేట్లకు తాము టిక్కెట్లను విక్రయించి నష్టపోలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో థియేటర్లను మూసివేస్తున్నట్లు బోర్డులు పెడుతున్నారు. దీంతో ఏపీలోని చాలా చోట్ల భీమ్లా నాయక్ ప్రదర్శనలు నిలిచిపోయాయి. ఏపీలో తాజా పరిస్థితులు సినిమా కలెక్షన్‌లపై ప్రభావం చూపే అవకాశముందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో భీమ్లానాయక్ సినిమాను కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్లు ముందుగా అంచనా వేసినట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
Bheemla Nayak: టిక్కెట్ రేట్ల ఎఫెక్ట్.. ఏపీలో మూతపడుతున్న థియేటర్లు
