Minister Narayana: రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి..
- క్యాపిటల్ జోన్ ప్రాపర్టీ షో బ్రోచర్ ను ఆవిష్కరించిన మంత్రి నారాయణ..
- రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది.. ఇప్పుడే కొంచెం కుదుటపడుతుంది..
- రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: క్యాపిటల్ జోన్ ప్రాపర్టీ షో బ్రోచర్ ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో ఉన్న తాగునీరు, పార్కులు, వీధి వ్యాపారుల సమస్యలు, పార్కింగ్ సమస్యలపై దృష్టి పెడతామన్నారు. అనధికార నిర్మాణాలు, లే అవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది.. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతుంది.. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది.. ఏ పని చేయాలన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా దారుణంగా చేసిందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Also Read
ఇక, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందేలా చేయాలని సీఎం నాకు చాలా సార్లు చెప్పుకొచ్చారు. భవన, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తున్నాం.. త్వరలోనే కొత్త నిబంధనలతో జివో జారీ చేస్తాం.. మా శాఖ నుంచి బిల్డర్స్ కు అన్ని విధాలా సహకారం ఉంటుంది.. గుంటూరు- మంగళగిరి- విజయవాడ- అమరావతినీ కలిపి భవిష్యత్తులో మెగా సిటీ గా చేయాలని సీఎం నిర్ణయించారు.. కోటి మంది జనాభాతో మెగా సిటీగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని నారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!