Minister Narayana: క్యాపిటల్ జోన్ ప్రాపర్టీ షో బ్రోచర్ ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో ఉన్న తాగునీరు, పార్కులు, వీధి వ్యాపారుల సమస్యలు, పార్కింగ్ సమస్యలపై దృష్టి పెడతామన్నారు. అనధికార నిర్మాణాలు, లే అవుట్లపై చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయింది.. ఇప్పుడిప్పుడే కొంచెం కుదుట పడుతుంది.. ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది.. ఏ పని చేయాలన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా దారుణంగా చేసిందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
ఇక, రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందేలా చేయాలని సీఎం నాకు చాలా సార్లు చెప్పుకొచ్చారు. భవన, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తున్నాం.. త్వరలోనే కొత్త నిబంధనలతో జివో జారీ చేస్తాం.. మా శాఖ నుంచి బిల్డర్స్ కు అన్ని విధాలా సహకారం ఉంటుంది.. గుంటూరు- మంగళగిరి- విజయవాడ- అమరావతినీ కలిపి భవిష్యత్తులో మెగా సిటీ గా చేయాలని సీఎం నిర్ణయించారు.. కోటి మంది జనాభాతో మెగా సిటీగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని నారాయణ వెల్లడించారు.