NTV Telugu Site icon

Pension Inspection: నేటి నుంచి రెండు రోజుల పాటు పింఛన్ల తనిఖీ

Ap Pensions

Ap Pensions

Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నేటి (డిసెంబర్ 9) నుంచి రెండు రోజులు పాటు అధికారులు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు. రాష్ట్రంలో నకిలీ పెన్షన్‌ దారులను ఏరి వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని కంప్లైంట్స్ రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ చర్యలకు సిద్ధమైంది.

Read Also: Digital Exports: ఈ జాబితాలో చైనా, జర్మనీ, జపాన్‌ల కంటే భారత్‌ టాప్..

ఇందులో భాగంగానే.. ఏపీలో ఈరోజు నుంచి రెండు రోజులు పాటు పింఛన్ల తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇక తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను అధికారులు సేకరణ చేయనున్నారు. ఇందు కోసం పక్క మండలానికి చెందిన సిబ్బందికి డ్యూటీ వేశారు. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలన చేయాల్సి ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.