Site icon NTV Telugu

విద్యాదీవెనపై రివ్యూ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను రాష్ర్టహైకోర్టు కొట్టివేసింది. జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసింది. తల్లుల ఖాతాలో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. రాష్ర్ట ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తు హైకోర్టు తుది తీర్పును వెలువరించింది.

ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రైవేట్‌ యాజమాన్యాలు పిటిషన్‌ వేయగా ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. చాలా ప్రైవేట్‌ పాఠశాలలో యజామాన్యాలే నేరుగా నగదును తీసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ రివ్యూ పిటిషన్‌ను వేసింది కానీ తాజాగా కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసి తుది తీర్పును ఇవ్వడంతో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version