రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీలో ఉద్యోగ సంఘాలకు రోజు రోజుకు గ్యాప్ పెరుగుతుంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రా మిరెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బొప్పరాజు, బండి శ్రీని వాస్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రా మిరెడ్డి మాట్లాడుతూ .. గత ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకుం డానే ఐఆర్ ప్రకటించిందన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతిని ధులు వాళ్ల పనులు కాకపోవడంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తు న్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేలా కొంత మంది ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుడి చేత్తో.. ఎడం చేత్తో ఓట్లేశామంటూ కామెంట్లు చేసిన వాళ్లు రాష్ట్రం మొత్తం తిరిగి టీడీపీకి ఓట్లేయించారని వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా సెక్రటేరియట్‌లో చంద్రబాబుకు పాలాభిషేకాలు చేశారని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. సీఎంతో చర్చించి పీఆర్సీ నివేదిక ఇస్తామని సీఎస్ చెప్పారు కానీ.. ఫలానా తేదీన వచ్చేయండని చెప్పలేదన్నారు. గతంలో సీఎంను కలిశాం.. అన్ని చేసేస్తామని చెప్పిన వాళ్లే.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆందోళనలు చేయడం దేనికంటూ వెంకట్రామిరెడ్డి వారిని ప్రశ్నించారు.
