Vizianagaram: వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా రోగికి వైద్య సేవలు అందించి మనిషి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. అందుకే వైద్యుడిని దేవునితో పోల్చారు. కానీ ప్రస్తుతం కొంత మంది డాక్టర్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయింది అన్నట్లు.. జలుబు చేసి దవాఖానకు వెళ్లిన ప్రాణాలతో తిరిగి వాస్తవమన్న గ్యారెంటీ లేదంటున్నారు ప్రజలు. పైసా మే పరమాత్మ అన్నట్లు ఉంది కొందరు డాక్టర్ల తీరు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు, బాలింతలు ప్రాణాలను పోగుకొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే విజయనగరంలో వెలుగు చూసింది. వివారాలోకి వెళ్తే.. విజయనగరం జిల్లా లోని దత్తిరాజేరు పీహెచ్సీలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గడువు తేదీ ముగిసిన మందులను వాడుతున్నారు. తాజాగా పిల్లలకు గడువు ముగిసిన వ్యాక్సిన్ ను ఇచారు వైద్యులు.
Read also:Padi Kaushik Reddy: ప్లీజ్ ఒక్క ఛాన్స్.. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి
పొరపాటున చేశారు అనుకుంటే పొరపాటే. కావాలని గడువు ముగిసిన మందుల పైన లేబుల్ ని మార్చి ఆ కాలం చెల్లిన మందులను ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇస్తున్నారు. ఈ దారుణాన్ని ఎన్ టీవీ వెలుగు లోకి తీసుకు వచ్చింది. ఎన్ టీవీ ప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లే సమయానికి పీహెచ్సీ సిబ్బంది వ్యాక్సిన్ పై లేబుల్ ను తారు మారు చేస్తున్నారు. ఎన్ టీవీ అక్కడని వెళ్లడంతో.. సిబ్బంది ఏం లేదని జారుకునేందుకు ప్రయాణించారు. కాగా మజల్స్ అండ్ రూబెల్ వ్యాక్సిన్ గడువు తొమ్మిదో నెలలో ముగిసినప్పటికీ ఆ కాలం చెల్లిన వ్యాక్సిన్ను వైద్య సిబ్బంది పిల్లలకు అందించారు. ఈ నేపథ్యంలో నలుగురు వైద్య అధికారులతో విచారణ జరిపింది ఎన్ టీవీ. గడువు ముగిసిన వ్యాక్సిన్ ఉంచడం ఒక నేరం కాగా.. లేబుల్ మార్చి మరో నేరానికి పాల్పడ్డారు వైద్య సిబ్బంది.. ఈ క్రామంలో క్రిందిస్థాయి సిబ్బందిని కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రయాత్నించారు.