NTV Telugu Site icon

పోలీస్ వ్యవస్థపై రాజకీయ విమర్శలు వద్దు: డీ.జీ.పీ గౌతమ్ సవాంగ్

మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉంది.

దీనిపై ఎన్‌ఐఏ సహకారం తీసుకుని గంజాయి సమస్యకు చెక్‌ పెట్టనున్నట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.గతేడాది కాలంగా రాష్ట్రంలో రూ. 2లక్షల 90వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. గత పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నర్సాపూర్ లో దొరికిన రూ. 3వేల కేజీల హెరాయిన్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఏపీ గంజాయి అక్రమ రవాణా కేంద్రమని 2016లోనే ఇతర రాష్ట్రాలు అన్నాయి. ముంద్రా పోర్ట్ లో దొరికిన హెరాయిన్ రాష్ట్రానిది కాదని మరోసారి స్పష్టం చేశారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌.