Site icon NTV Telugu

Buddha Venkanna: టీడీర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది..

Budda Venkanna

Budda Venkanna

Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు దోచేశారు.. ఇదంతా జగన్ డైరెక్షన్లో జరిగింది అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టీడీఆర్ బాండ్ల రూపంలో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు.. ఇది సామాన్య ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తే అవ్వదు.. నాటి సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.. జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రజా ధనం దుర్వినియోగంపై సీఐడికి ఫిర్యాదు చేయబోతున్నామని బుద్దా వెంకన్న తెలిపారు.

Read Also:MS Dhoni Birthday : సతీమణితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ధోని.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువిరుస్తున్న విషెస్.. (video)

టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సహకరించిన అధికారుల పైనా ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నా పేర్కొన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.. లిఖితపూర్వకంగా ఈ అంశంపై ఫిర్యాదు చేస్తాను.. సీఐడీ కూడా స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.. ఇది చాలా పెద్ద క్రిమినల్ చర్య అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీస్తామని వెల్లడించారు.

Exit mobile version